Indian railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెండో వాటర్ బాటిల్ కూడా ఫ్రీ..
Indian railway: ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.
Indian railway: ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద, రైలు ప్రయాణంలో ప్రయాణికులకు డిమాండ్‌పై రెండవ బాటిల్ వాటర్ ఇవ్వనున్నారు. దీని కోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని ఈ ఉత్తర్వులతో రైల్వే స్పష్టం చేసింది. ఈ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అంటే, మీరు మరో బాటిల్ వాటర్ కోసం అడగవచ్చు.
భారతీయ రైల్వే ప్రకారం, దేశంలోని వివిధ నగరాల్లో దాదాపు 50 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలు ప్రయాణికులకు ఇష్టమైన రైలుగా మారుతోంది. ఇప్పటి వరకు, ఈ రైలులో ప్రయాణీకులకు ప్రయాణ సమయంలో ఒక లీటర్ వాటర్ బాటిళ్లను ఇచ్చేవారు. ప్రయాణికులంతా కాస్త నీళ్లు తాగి వదిలేస్తున్నారు. ఇలా రోజూ వేల లీటర్ల నీరు వృథాగా పోతున్నాయంట.
తాగునీటి వృథాను ఆదా చేసేందుకు, అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రతి ప్రయాణీకుడికి 500 మిల్లీలీటర్ల రైల్ నీర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పీడీడబ్ల్యూ) బాటిల్‌ను అందించాలని రైల్వే నిర్ణయించింది. 500 ఎంఎల్‌ల మరో రైల్ నీర్ పీడీడబ్ల్యూ బాటిల్‌ను ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రయాణికులకు డిమాండ్‌పై అందించనున్నారు.
24 రాష్ట్రాల్లో వందే భారత్..
ఢిల్లీ-వారణాసి మధ్య తొలిసారిగా ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈరోజు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుకుంది. 31 మార్చి 2024 వరకు వందే భారత్ రైళ్లలో రెండు కోట్ల మందికి పైగా ప్రయాణించారు. దేశవ్యాప్తంగా మొత్తం 284 జిల్లాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలకు అనుసంధానించాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటుంది. వందేభారత్ రైళ్లు 26,341 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. రైల్వే నెట్‌వర్క్‌లోని 100 రూట్లలో మొత్తం 102 వందే భారత్ రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి.