Viral Video: నువ్వేం టీచర్‌వి తల్లి.. పంతులమ్మ చేసిన పనికి ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Viral Video: గురువు.. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే శక్తి అని అర్థం.

Update: 2024-08-01 02:37 GMT

Viral Video: నువ్వేం టీచర్‌వి తల్లి.. పంతులమ్మ చేసిన పనికి ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Viral Video: గురువు.. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే శక్తి అని అర్థం. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి, సన్మార్గంలో నడిపించడంలో గురువులదే కీలక పాత్ర. అందుకే సమాజంలో గురువులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి గురువుకే ఉంటుంది. అందుకే గురువును దైవంగా భావిస్తుంటారు. కానీ కొందరు గురువులు చేసే పనులు చూస్తుంటే మాత్రం ఆ వృత్తికే తలవొంపులు తెచ్చిపెడుతోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే టీచర్‌ వత్తికే తలవంపులు తీసుకొచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ పరిధిలో ఉన్న ధనిపూర్ తాలూకాలోని గోకుల్పూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళా టీచర్‌ ఏకంగా క్లాసు రూమ్‌లోనే హాయిగా నిద్రపోయింది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎంచక్కా కునుకు తీసింది. హాయిగా చాప వేసుకొని నిద్రించింది. అక్కడితో ఆగకుండా ఆ క్లాసులోని చిన్నారులతోనే విసనకర్రతో గాలి విసిరించుకుంది.

అయితే ఇదంతా అక్కడే ఉన్న కొందరు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఆ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. విధుల్లో ఉండగా అలా నిద్రపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ.. ఇలాంటి వారివల్లే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వీడియో చూసేనా అధికారులు కఠినంగా స్పందిస్తారో లేదో చూడాలి. 


Tags:    

Similar News