Indian Railways: అబ్బో, ఇదేం రైల్వే స్టేషన్ భయ్యా.. ఒకే ట్రాక్‌పై ఏకంగా 3 రైళ్లు ఆపొచ్చంట..!
Largest Railway Platform: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉంటుంది.
Largest Railway Platform: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద రైలు నెట్‌వర్క్‌గా మారిన భారతీయ రైల్వే.. మరెన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. వీటిలో ఒకటి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్ కూడా ఒకటి. అయితే, మనం దేశంలోనే పొడవైన ప్లాట్‌ఫారమ్ గురించి మాట్లాడితే, గోరఖ్‌పూర్ పొడవైన ప్లాట్‌ఫారమ్‌గా రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ చరిత్రను ఓసారి తెలుసుకుందాం.
ప్లాట్‌ఫారమ్ పొడవు ఎంత?
దేశంలోని పొడవైన ప్లాట్‌ఫారమ్ యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉంది. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన ప్లాట్‌ఫారమ్‌లు దేశంలోని అతిపెద్ద ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. 2013లో, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్‌గా కూడా ప్రకటించారు. ఇక్కడ ఉన్న ప్లాట్‌ఫారమ్ పొడవు సుమారు 1355.4 మీటర్లు అంటే 1 కి.మీ కంటే ఎక్కువ. అయితే, అసలు దీని పొడవు 1366.33 మీటర్లు అని కూడా చెబుతుంటారు.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ చరిత్ర..
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దాదాపు 10 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ చరిత్ర కూడా చాలా పాతది. దీనిని మొదట గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌గా నిర్మించారని చెబుతుంటారు. గోరఖ్‌పూర్ జంక్షన్ స్టేషన్ 1886-1905లో నిర్మించారు. మీడియా నివేదికల ప్రకారం, గోరఖ్‌పూర్ జంక్షన్ ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు చాలా ఎక్కువ. 26 కోచ్‌లతో రెండు రైళ్లను ఒకేసారి నిలిపేయోచ్చు. ఈ జంక్షన్ మీదుగా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రైళ్లు వెళ్తుంటాయి. ఈ జంక్షన్ మీదుగా రోజుకు దాదాపు 170 రైళ్లు ప్రయాణిస్తాయి.