Bike Mileage: ఈ 2 పనులు చేస్తే మీ బైక్ ఒక్కసారిగా మైలేజీ పెరుగుతుంది..!
Bike Mileage: బైక్ మైలేజ్ అనేది ప్రతి బైక్ రైడర్ ఎదుర్కొనే పెద్ద సమస్య.
Bike Mileage: బైక్ మైలేజ్ అనేది ప్రతి బైక్ రైడర్ ఎదుర్కొనే పెద్ద సమస్య. ఎందుకంటే పెరిగిన ఇంధన ధరలకి తోడు బైక్ మైలేజ్ ఇవ్వకుంటే పెట్రోల్ ఖర్చులు తడిసి మోపడవుతాయి. సగం సాలరీ బైక్ పెట్రోల్‌కే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే ఇవి పాటించడం వల్ల మీ బైక్ మైలేజీ పెంచుకోవచ్చు.
ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం
బైక్‌లో ఉండే ఎయిర్ ఫిల్టర్ చాలా ముఖ్యమైన భాగం. ఇది శుభ్రంగా లేకపోతే ఇంజిన్ దెబ్బతింటుంది. చెత్త పేరుకుపోతుంది. దీంతో ఇంజిన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. ఈ పరిస్థితిలో మీ బైక్ మైలేజ్ తగ్గుతుంది. ఇలా చాలా కాలం కొనసాగితే బైక్ ఇంజన్ పూర్తిగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీరు ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేయాలి. తరచుగా ఇలా చేస్తుంటే ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా ఉండి ఇంజన్ కండిషన్ బాగుంటుంది. తద్వారా బైక్ మైలేజి పెరుగుతుంది.
స్పార్క్ ప్లగ్
స్పార్క్ ప్లగ్ కూడా బైక్‌లో అతి ముఖ్యమైన భాగం. ఇది పాడైపోతే బైక్ అస్సలు స్టార్ట్ అవ్వదు. అంతే కాదు బైక్‌ను ఫిట్‌గా ఉంచడానికి, దాని మైలేజీని నిర్వహించడానికి బైక్ స్పార్క్ ప్లగ్‌ను క్లీన్ చేయాల్సి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్పార్క్ ప్లగ్‌లో కార్బన్ పేరుకుపోతుంది. దీని కారణంగా అది పనిచేయడం మానేస్తుంది. మీరు బైక్ మైలేజీని పెంచుకోవాలనుకుంటే ఎల్లప్పుడూ స్పార్క్ ప్లగ్‌ని శుభ్రం చేయాలి. దీనివల్ల బైక్ సరిగ్గా పని చేయడంతోపాటు మంచి మైలేజీ వస్తుంది. మీరు ఈ పద్ధతిని అవలంబిస్తే ప్రతి నెలా డబ్బులు కూడా ఆదా చేసుకున్నవారవుతారు.