Viral Video: ఈ జింక తెలివికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: తాజాగా ఓ జింక ప్రదర్శించిన తెలివి ముందు మనుషులు కూడా తక్కువే అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2024-08-19 11:00 GMT

Viral Video

Viral Video: బతకాలంటే డబ్బు, హోదాతో పాటు తెలివి కూడా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత డబ్బున్నా కొన్ని సందర్భాల్లో తెలివి లేకపోతే అదంతా వృథానే అని చెప్పాలి. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితం కాదండోయ్‌. జంతువులకు కూడా తెలివి ఉండాల్సిందే. తమ ప్రాణాల మీదికి వస్తే జంతువులు సైతం తెలివితే ఆ అపాయం నుంచి తప్పించుకుంటాయి.

తాజాగా ఓ జింక ప్రదర్శించిన తెలివి ముందు మనుషులు కూడా తక్కువే అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తన ప్రాణాన్ని కాపాడుకునే క్రమంలో జింక చూపించిన తెలివికి ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ జింక ఏం చేసిందనేగా మీ సందేహం. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఓ జింక అడవిలో ఓ చోట పడుకొని ఉంది. అదే సమయంలో అక్కడికి ఓ చిరుత, హైనా రెండు వచ్చాయి. జింక చనిపోయిందని భావించిన చిరుత ఎంచక్కా.. జింక తినేద్దామని దగ్గరకు వచ్చింది. అంతలోనే అదే జింక కోసం హైనా కూడా వచ్చేసింది. దీంతో చిరుత, హైనాల మధ్య చిన్న పోరు జరిగింది. చిరుతని బెదిరించి.. జింకను తిందాం కదా అని దగ్గరకు వెళ్తుంది. జింక చనిపోయింది అనుకుంటుంది. మళ్లీ చిరుతని బెదిరించి జింక దగ్గరకు వచ్చే క్రమంలో.. జింక ఒక్కసారిగా లేచి పరుగులు పెడుతుంది.

తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే జింక అలా చనిపోయినట్లు నటించందన్నమాట. చిరుత, హైనాలు కాస్త అటుగా వెళ్లగానే లేచి పరుగులు పెట్టేసింది. ఇదంతా అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జింక సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.



Tags:    

Similar News