optical illusion: మీ కళ్లలో పవర్ ఉందా.? అయితే ఇందులో ఓపెన్ చేసిన లాక్‌ను కనిపెట్టండి చూద్దాం.
optical illusion: ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మీ మానసిక స్థితిని అంచనా వేసేవి అయితే మరికొన్ని మీ ఐ పవర్‌ను పరీక్షించేవి కూడా ఉన్నాయి.
optical illusion: సోషల్ మీడియా అనేది కేవలం సమయం వృథా అయ్యే వ్యవహారం మాత్రమే కాదు. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ సోషల్ మీడియా ద్వారా అటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు విజ్ఞానాన్ని కూడా పొందొచ్చు. అలాంటి కంటెంట్‌కు సోషల్ మీడియా పెట్టింది పేరు. ఇలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఒకటి.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మీ మానసిక స్థితిని అంచనా వేసేవి అయితే మరికొన్ని మీ ఐ పవర్‌ను పరీక్షించేవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం కంటి పవర్‌ను పరీక్షించే ఫొటోలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. వరుసగా లాక్‌లు కనిపిస్తున్నాయని అంటారు కదూ! అయితే సదరు లాక్స్ అన్ని క్లోజ్ చేసినవి మాత్రమే ఉన్నాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే అందులో ఒక లాక్ ఓపెన్ చేసి ఉంది. ఆ ఓపెన్ అయిన లాక్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. మరి ఓపెన్ చేసిన లాక్‌ను గుర్తుపట్టారా.? కేవలం 10 సెకండ్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే మీ ఐ పవర్‌కు తిరుగే లేదని అర్థం చేసుకోవచ్చు.
ఫొటోను ఓసారి తీక్షణంగా గమనిస్తే ఓపెన్ చేసిన లాక్‌ను గుర్తు పట్టొచ్చు. ఓసారి జాగ్రత్తగా గమనించండి లాక్ కనిపించిందా? ఏంటి ఎంత ట్రై చేసినా ఓపెన్ చేసిన లాక్ కనిపించడం లేదా.? అయితే ఓసారి నాలుగో వరుసలాఓ మిడిల్‌లో చూడండి ఆ లాక్ ఉంటుంది. ఇంత క్లియర్‌గా చెప్పినా పజిల్ సాల్వ్ చేయకపోతే సమాధానం కోసం కింద చూడండి.