Mobile Phone Alert: మీ ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఏటీఎం కార్డ్‌ పెడుతున్నారా.. ప్రమాదంలో పడుతారు జాగ్రత్త..!

Mobile Phone Alert: కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఏటీఎం కార్డు, మెట్రోకార్డ్‌, బస్‌ పాస్‌ లాంటివి పెట్టడం మీరు గమనించే ఉంటారు.

Update: 2024-05-22 04:51 GMT

Mobile Phone Alert: మీ ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఏటీఎం కార్డ్‌ పెడుతున్నారా.. ప్రమాదంలో పడుతారు జాగ్రత్త..!

Mobile Phone Alert: కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఏటీఎం కార్డు, మెట్రోకార్డ్‌, బస్‌ పాస్‌ లాంటివి పెట్టడం మీరు గమనించే ఉంటారు. వారు వాటిని మరిచిపోకుండా ఉండేందుకు ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో పెడుతారు. వాళ్ల ఆలోచన బాగానే ఉంది కానీ ఇది రిస్క్‌తో కూడుకున్న పని అని వారికి తెలియదు. ఇలాంటి వారు చేసే చిన్న పొరపాటు పెద్ద ప్రమాదాల కు కారణమవుతుంది. ఈ రోజు ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో ఇలాంటి వస్తువులు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ తరచుగా వేడెక్కడానికి మందంపాటి బ్యాక్‌ కవర్‌ ఉండడమే ప్రధాన కారణం. ఇప్పటికే దీనిని భరించలేని ఫోన్‌ దీని లోపల అనేక రకాల వస్తువులను పెట్టడం వల్ల మరింత హీట్‌ అవుతుంది. ఎందుకంటే గాలి ఫోన్‌ లోపలికి భాగాలకు వెళ్లకుండా ఇవి అడ్డుగా ఉంటాయి. దీనివల్ల ఫోన్ మరింత హీట్‌ అవుతుంది. దీంతో పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు పేలిన సంఘటనలు కూడా జరిగాయి.

ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల ఛార్జింగ్‌లో సమస్యలు ఎదురవుతాయి. ఈ అలవాటు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా ఛార్జ్ అయ్యే వరకు పక్కన పెట్టాలి. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగిస్తే ఫోన్ వేడెక్కడం, పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మరొక కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగించడం లేదా లోకల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ హీట్ అవుతుంది. దీంతో ఫోన్ పేలిపోతుంది.

కొన్నిసార్లు ఫోన్ అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతుంది. ఎక్కువ సేపు ఎండలో ఫోన్ వాడకుండా ఉండండి. ఫోన్ ఛార్జ్‌లో ఉన్నప్పుడు గేమింగ్ లేదా ఫోన్‌ని ఉపయోగించడం చేయకూడదు. ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ మాట్లాడితే పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు దాని బ్యాక్‌ కవర్‌ను తీసివేయడం మంచిది.

Tags:    

Similar News