Apple Search Engine: గూగుల్ కు పోటీగా ... యాపిల్ సెర్చ్ ఇంజన్ !
Apple Search Engine: ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చింజన్ కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఏ చిన్నవిషయం గురించి తెలుసుకోవాలన్న... గూగుల్ లో సెర్చ్ చేయవల్సిందే..
Apple Search Engine: ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చింజన్ కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఏ చిన్నవిషయం గురించి తెలుసుకోవాలన్న... గూగుల్ లో సెర్చ్ చేయవల్సిందే.. అయితే .. గూగుల్ సెర్చ్ ఇంజన్ కు పోటీగా యాపిల్ మరో సెర్చ్ ఇంజన్ ను తేనున్నది. గతంలో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్లు వచ్చినా అవి గూగుల్ పోటీకి నిలబడలేకపోయాయి.
టెక్ వెబ్‌సైట్ కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించటానికి సిద్దమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. యాపిల్ తన కొత్త ఏఓఎస్ 14 వెర్షన్‌లో గూగుల్ సెర్చ్‌ను దాటేసింది. సెర్చ్ ఇంజిన్ల కోసం యాపిల్ చేయబోయే నియామకాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్నెల్పీ) వంటి రంగాల్లోని నిపుణులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా యాపిల్ సెర్చ్ ఇంజిన్ కేవలం యాపిల్ ప్రొడక్ట్స్ ను వాడేవారికి మాత్రమే లభిస్తుంది. ఇతర యూజర్లకు అందుబాటులో ఉండదు. అలాగే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో వచ్చిన మాదిరిగా యాపిల్ సెర్చ్ ఇంజిన్ ఫలితాల్లో యాడ్స్ రావు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఓఎస్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌ను ఉంచడానికి గూగుల్ ఏటా యాపిల్‌కు మిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తానే స్వయంగా సెర్చ్ ఇంజన్ ను రూపొందించనున్నట్టు తెలుస్తుంది.