Viral Video: లైక్‌ల కోసం ఏమైనా చేస్తారా.? యువతి చేసిన పనికి నెటిజన్లు ఫైర్..
Viral Video: లైక్‌ల కోసం ఏమైనా చేస్తారా.? యువతి చేసిన పనికి నెటిజన్లు ఫైర్..
Viral Video: ఎలాగైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంత సాహసానికైనా ఒడి గడుతున్నారు. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటే మరికొందరు పక్కవారి ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఇక కొందరు మహిళలు నడీ రోడ్లపైనే రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.
తమ రీల్స్‌కు లైక్స్ రావాలని, ఫాలోవర్స్ పెరగాలని ఏది పడితే అది చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల ద్వారా వారు ఎంత పాపులర్ అవుతున్నారన్న విషయం పక్కనపెడితే.. నెటిజన్ల నుంచి విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ యువతి చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఓ రైల్వేస్టేషన్లో ప్రయాణికులంతా రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అయతే ఇదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఒకసారిగా పూనకం వచ్చిన వ్యక్తిలా ఊగిపోయింది. పిచ్చి పిచ్చిగా డ్యాన్స్‌లు చేస్తూ కేకలు పెట్టింది. అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న ఓ మహిళలను వెను నుంచి ఢీకొడుతూ డ్యాన్స్ దీంతో సదరు మహిళ కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇది చూసిన అక్కడి అసలేం జరుగుతోందని కన్ఫ్యూజ్కి గురయ్యారు.
అయితే ఇదంతా ఓ ప్రీ ప్లాన్డ్ వీడియో. సదరు యువతి కావాలనే చేసింది. ఇక అక్కడే ఉన్న మరో మహిళ కూడా యువతి స్నేహితురాలే. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. కంగారు పడకండి, ఆ మహిళ నా స్నేహితురాలే అంటూ వీడియోను షేర్ చేసిందా యువతి. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. లైక్‌ల కోసం ఇలాంటి పనులు చేయడం అవసరమా అంటూ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు.