Viral Video: ఈ మహిళ ధైర్యం చూస్తే అవాక్కవ్వాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: వర్షాకాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథిగా వచ్చేస్తుంటాయి పాములు.

Update: 2024-07-27 05:45 GMT

Viral Video: ఈ మహిళ ధైర్యం చూస్తే అవాక్కవ్వాల్సిందే.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: వర్షాకాలం వచ్చిందంటే చాలు పిలవని అతిథిగా వచ్చేస్తుంటాయి పాములు. అప్పటి వరకు ఎక్కడో నక్కి నక్కి దాక్కున్న పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇటీవల అయితే ఏకంగా కార్లలో, హెల్మెట్స్‌లో, స్కూటీల్లో దర్శనమిస్తున్నాయి. అయితే పామును చూడగానే సహజంగా మనం ఏం చేస్తాం.? ఏముంది ఒక్కసారిగా గెంతులు వేస్తూ అక్కడి నుంచి పారిపోతాం కదూ! అయితే ఓ మహిళ మాత్రం పామును అదేదో పొట్లకాయను పట్టుకున్నట్లు పట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బిలాస్‌పూర్‌కు చెందిన అజిత అనే యువతి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె పాములను పట్టే స్నేక్‌ కచార్‌. అయితే ఇదే సమయంలో ఓ కంప్యూటర్‌ ల్యాబ్‌లోకి పెద్ద పాము ఒకటి నెమ్మదిగా ప్రవేశించింది. వెచ్చగా ముందేమో కానీ మానిటర్‌ వెనకాలకు వెళ్లి నక్కి నక్కి దాక్కుతుంది. ఇది గమనించిన వారు వెంటనే అజితకు కాల్ చేసి విషయాన్ని తెలిపారు. అయితే అజిత ఏమాత్రం జంకు లేకుండా వచ్చేసి పామును సునాయాసంగా పట్టుకుంది. అంతటితో ఆగకుండా ఆ పామును చూపిస్తూ సరదాగా నవ్వింది.

అనంతరం తనతో పాటు తెచ్చుకున్న సంచిలో పామును వేసుకొని బయటకు వెళ్లిపోయింది. దీంతో అక్కడనున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేయగా.. అజిత తన ఇన్‌స్టా పేజీలో వీడియోను పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో కాస్త క్షణాల్లో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన వారంతా ఆమె ధైర్యానికి ఫిదా అవుతున్నారు. పామును చూడాలంటేనే భయమవుతుంది. అలాంటిది అజిత పామును ఏదో పొట్లకాయ పట్టుకున్నట్లు పట్టుకుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అజిత ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మరి కొందరైతే మహిళలు చేయ లేనిది ఏది లేదని చెప్పడానికి ఇదో మరో నిదర్శనం అని అంటున్నారు.


Tags:    

Similar News