Viral Video: దొంగ పాము.. ఏం ఎత్తుకెళ్లిందో తెలుసా.? వైరల్‌ వీడియో

ఈ పాము చేసిన పని చూసిన వారంతా వామ్మో ఇది దొంగపాము అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Update: 2024-08-15 16:30 GMT

Viral Video: దొంగ పాము.. ఏం ఎత్తుకెళ్లిందో తెలుసా.? వైరల్‌ వీడియో 

Viral Video: ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. స్కూటీ డిక్కీలో ఒక పాము, హెల్మెట్‌లో మరో పాము. ఇలా రకరకాలుగా పాములు వైరల్‌ అవుతున్నాయి. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండడంతో ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ పాము చేసిన పని చూసిన వారంతా వామ్మో ఇది దొంగపాము అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా పాము కనిపించగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో ఉంటాం. అందుకే పాము కనిపించినా వెంటనే దాన్ని తరిమికొట్టడమో, లేదా చంపపడమే చేస్తుంటాం. అయితే మెజారిటీ పాములు మనుషులపై దాడి చేయడానికే ప్రయత్నిస్తుంటాయి. అయితే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే పాములు ఇలా కూడా చేస్తాయా అనే సందేహం వస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ పాము ఇళ్ల మధ్యలోకి వచ్చింది. దీంతో జనమంతా ఒక్కసారిగా భయపడి కేకలు పెట్టారు. అయితే వచ్చిన ఆ పామును తరిమికొట్టడానికి కొందరు చెప్పులతో దాడి చేశారు. దీంతో వెంటనే ఆ చెప్పును నోట కరుచుకొని పారి పోయింది. అక్కడున్న వారంతా ఎంత అరుస్తున్నా.. వెనక్కి చూడకుండా చెప్పును వదలకుండా ఒకటే పరుగు పెట్టింది. అక్కడే ఉన్న చెట్ట మధ్యలోకి వెళ్లిపోయింది. దీనతంటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ఈ పాము నిజంగానే దొంగపాము అంటూ కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు.. ఆ పాముకు అంతలా చెప్పు ఎందుకు నచ్చిందో అంటి స్పందిస్తున్నారు.


Tags:    

Similar News