Viral Video: ఎక్కడా ప్లేస్‌ లేనట్లు అక్కడే దూరాలా.? మహిళ కొప్పులోకి పాము..

Viral Video: ఎక్కడా ప్లేస్‌ లేనట్లు అక్కడే దూరాలా.? మహిళ కొప్పులోకి పాము..

Update: 2024-08-01 15:00 GMT

Viral Video: ఎక్కడా ప్లేస్‌ లేనట్లు అక్కడే దూరాలా.? మహిళ కొప్పులోకి పాము..

Viral Video: పాము.. ఈ పేరు వినగానే ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది, గుండె దడ ఒక్కసారిగా పెరుగుతుంది. ఒకప్పుడు అడువుల్లో ఉండే పాములు ఇప్పుడు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉండే పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వస్తున్న పాములను స్మార్ట్‌ ఫోన్స్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

అయితే సాధారణంగా పాములు విడిచిన షూలలోకి, స్కూటీల్లోకి, హెల్మెట్స్‌లోకి వెళ్లిన సంఘటనలు చూశాం. అయితే తాజాగా పాము ఏకంగా ఒక మహిళ కొప్పులోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక మహిళ ప్రశాంతంగా నిద్రపోతోంది. అయితే అంతలోనే ఓ చిన్న పాము పిల్ల అటుగా వచ్చింది. దీంతో నిద్రిస్తున్న ఆ మహిళ కొప్పులోకి పాకిన పాము ఎంచక్కా జుట్టులో పాకుతూ కనిపించింది. అయితే ఆ విషయం ఆ మహిళకు తెలుసో లేదో కానీ అలాగే పడుకుండి పోయింది.

ఇదంతా అక్కడే ఉన్న వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేశాడు. ఇక ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. ఎక్కడ చోటు లేదన్నట్లు ఆ పాము అక్కడికే వెళ్లాలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరైతే ఆ వీడియో ఎవరో కావాలని ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు కనిపిస్తోందని కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి పాము అలా కదులుతున్న ఆ మహిళ కదలకపోవడం, ఒవ్యక్తి జుట్టులో పాము ఉన్నా దాన్ని తరిమికొట్టాల్సింది పోయి.. కెమెరాలో రికార్డ్‌ చేయడం చూస్తుంటే ఇదంగా ప్రీ ప్లాన్‌ వీడియో అయ్యుండొచ్చని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటిరకు ఏకంగా 2 లక్షల మందికి పైగా వీక్షించారు.


Tags:    

Similar News