Viral Video: చిన్నారులను ఒంటరిగా వదిలేయొద్దని అనేది ఇందుకే.. షాకింగ్ వీడియో..!
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. నిత్యం వారిపై ఓ కన్నేసి ఉంచాలని హెచ్చరిస్తుంటారు.
Viral Video: చిన్నారులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని చెబుతుంటారు. తెలిసో, తెలియకో వారు చేసే కొన్ని పనులు వారి ప్రాణాల మీదికి తెచ్చి పెడుతుంటాయి. మొన్నటి మొన్న ఓ చిన్నారి ఛార్జింగ్ వైరును నోట్లో పెట్టుకొని మరణించిన వార్త అందరినీ కలిచి వేసిన విషయం తెలిసిందే.
అందుకే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. నిత్యం వారిపై ఓ కన్నేసి ఉంచాలని హెచ్చరిస్తుంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోను చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. చిన్నారుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చెబుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందటే.. ఇద్దరు చిన్నారులు ఆడుతూ చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రదేశానికి చేరుకున్నారు. అందులో చిన్న బాలుడు నేరుగా వెళ్లి ఆ నీటిలో పడిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని మరో బాలిక దగ్గర్లలో న్న వారిని పిలవడానికి కేకలు వేస్తూ వెళ్లింది. అయితే అప్పటికే నీటిలో నుంచి బుడగలు వచ్చాయి.
ఇక చిన్నారి ప్రాణాలు గాల్లో కలుస్తాయనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడి వచ్చాడు. వెంటనే నీటిలోకి దూకి బాలుడిని బయటకు తీశాడు. అయితే బాలుడు కాసేపు నీటిలో ఉన్నా ప్రాణాపాయం మాత్రం తప్పింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు చిన్నారులను అలా వదిలేయడం పేరెంట్స్ తప్పే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.