Viral Video: సైడ్ ఇండికేషన్ ఇలా కూడా ఇస్తారా.? వైరల్ అవుతోన్న వీడియో
రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భద్రతా నియమాలను పాటించకపోతే మనతో పాటు మన పక్కన ఉన్న వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భద్రతా నియమాలను పాటించకపోతే మనతో పాటు మన పక్కన ఉన్న వారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే చిన్న తనం నుంచి రోడ్డు భద్రతా నియమాలను పాఠ్యాంశంలో ఒక భాగంగా చెబుతుంటారు. ఇలాంటి వాటిలో సైడ్ ఇండికేటర్ ఒకటి. సాధారణంగా ఎవరైనా ఒక వాహనంపై వెళ్తున్న సమయంలో మార్గం మార్చాల్సి వస్తే ఇండికేటర్ వేయాలి సూచిస్తారు.
దీనికి కారణం వెనకాల నుంచి వస్తున్న వ్యక్తులు అలర్ట్ అవుతారు. దీంతో ప్రమాదం బారిన పడకుండా ఉంటారు. అయితే ఒకవేళ ఇండికేటర్ పనిచేయకపోయినా, పని చేసినా చేతిని పక్కకు చాచడం మనలో చాలా మందికి అలవాటే ఉంటుంది. పక్క వీధిలోకి బైక్‌ను టర్న్ చేస్తున్న సమయంలో అటువైపుగా చేతి పెడుతుంటారు. అయితే ఇలా చేసే ఓ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాడు. అదేంటి ఇంతదానికే వైరల్ ఎందుకయ్యాడని ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఇంతలోనే మలుపు తిరిగే సమయం వచ్చింది. దీంతో వెంటనే తన ఎడమ కాలును అటువైపుగా చూపించాడు. చేయితో చూపించాల్సింది కాలు పైకి ఎత్తే సరికి అది కాస్త వింతగా మారింది. ఇదంతా వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ అవుతోంది. ఇలా కూడా సిగ్నల్ ఇవ్వొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇదేదో కావాలనే చేసి వీడియోను వైరల్ చేసినట్లు ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.