Viral Video: నడీ రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే..

ఇంతకీ ఏమైందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి నడీ రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.

Update: 2024-09-02 08:10 GMT

Viral Video: నడీ రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే.. 

పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అంటుంటారు. కొందరి ఆలోచనలు ఊహకు కూడా అందవు. మరీ ముఖ్యంగా మద్యం సేవించిన వారు చేసే కొన్ని పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో వైరల్‌ అవుతోంది. రాత్రి వర్షం పడుతోన్న సమయంలో ఓ వ్యక్తి చేసిన పిచ్చి పనికి నెటిజన్లు దుమ్మొత్తి పోస్తున్నారు.

ఇంతకీ ఏమైందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి నడీ రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక షార్ట్‌ వేసుకొని దర్జాగా చెయిర్‌ పై కూర్చున్నాడు. వాహనాలు వస్తున్నాయి, పోతున్నాయి. కొన్ని వాహనాలను అతన్ని తప్పించుకొని ముందుకు సాగాయి. అయితే ఇదే సమయంలో  అటుగా ఓ పెద్ద లారీ వచ్చింది. ఆ లారీ కొంచెం వ్యక్తి కూర్చున్న కుర్చీని ఢీకొట్టింది. దీంతో వెంటనే వ్యక్తి కింద పడిపోయాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న కొందరు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు.

అయితే కొంతలో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పొరపాటున చెయిర్‌ అటువైపు పడి ఉంటే. అతను లారీ టైర్ల కింద పడి నుజ్జు నుజ్జయ్యే వాడు. అదృష్టం బచాయించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ లారీ డ్రైవర్‌ ఏమైందో అని లారీ ఆపబోయినా.. అక్కడున్న వారంతా పర్లేదు వెళ్లిపో, వెళ్లిపో అంటూ చెప్పడం గమనార్హం. ఆ వ్యక్తి స్థానికంగా ఎంత రచ్చ చేశాడో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అతని మానసిక స్థితి సరిగ్గా లేదంటూ స్పందించారు. 


Tags:    

Similar News