Viral Video: మీ ఫుట్‌బాల్ పిచ్చి తగలెయ్య.. మరీ అక్కడ కూడానా.?
Viral Video: భారతీయులకు క్రికెట్ ఎలాగే ప్రపంచానికి ఫుట్‌బాల్ అలాగా.. మరీ ముఖ్యంగా సాకర్ వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు.
Viral Video: భారతీయులకు క్రికెట్ ఎలాగే ప్రపంచానికి ఫుట్‌బాల్ అలాగా.. మరీ ముఖ్యంగా సాకర్ వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఫుట్‌బాల్ ప్రియులు మ్యాచ్‌లను వీక్షిస్తూ ఎంజాయ్‌చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట ఓ వైరల్ అవుతోన్న ఓ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫుట్ బాల్ అంటే మరీ ఇంత పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా వీడియో..? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
దక్షిణ అమెరికాలోని ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కడసారి చూపు కోసం ఇంట్లోనే శవాన్ని ఉంచారు. అయితే అదే సమయంలో చిలీ, పెరు కోపా అమెరికా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది.
దీంతో శవపేటికను పక్కనే పెట్టుకొని కుటుంబ సభ్యులంతా మ్యాచ్‌ను వీక్షించారు. అంతేకాకుండా శవపేటికపై చిలీ దేశం జెండాను సైతం ఉంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు శవాన్ని పక్కన పెట్టుకొని ఫుట్ బాల్ మ్యాచ్ చూడడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదే గదిలో సదరు మరణించిన వ్యక్తి ఒక కప్‌తో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో మరణించిన వ్యక్తి మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ అయ్యిండొచ్చని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.