Viral Video: కొంప ముంచిన ఫొటో షూట్‌.. పట్టాలపై జంట, అంతలోనే రైలు..

Viral Video: కొంప ముంచిన ఫొటో షూట్‌.. పట్టాలపై జంట, అంతలోనే రైలు..

Update: 2024-07-15 15:15 GMT

Viral Video: కొంప ముంచిన ఫొటో షూట్‌.. పట్టాలపై జంట, అంతలోనే రైలు.. 

Viral Video: ప్రస్తుతం జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి పెరిగింది. ఎక్కడికి వెళ్లినా ఫొటోలు దిగాలి, వెంటనే ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసేయాలి. అయితే లైక్‌ల కోసం ఓ అడుగు ముందుకేసి ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన జరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని పాలీ జిల్లాకు చెందిన రాహుల్‌ మెవాడా అతని భార్య జాహ్నవితో కలిసి ఘోరం ఘాట్‌కు వెళ్లారు. అక్కడ ప్రకృతి రమణీయత మధ్య ఫొటోలు దిగాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే అక్కడున్న హెరిటేజ్ రైల్వే వంతెనపై ఫొటోలు దిగడం ప్రారంభించారు. అయితే ఎఫెక్ట్‌ కోసం ట్రాక్‌ మధ్యలోకి వెళ్లి మరీ ఫొటోలు దిగారు. అయితే అంతలోనే ట్రాక్‌పై నుంచి రైలు దూసుకొచ్చింది.

దీంతో రైలు దగ్గరి దాక వచ్చే సరికి ఆ జంట ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ట్రాక్‌పైనే ఉంటే చచ్చిపోవడం ఖాయమని భ్రమపడి వంతెనపై నుంచి లోయలోకి దూకేశారు. అయితే ఆ రైలు అప్పటికే ఆగిపోవడం గమనార్హం. ట్రాక్‌పై జంటను గమనించిన లోకో పైలట్‌ రైలును ఆపేశాడు. అయితే అంతలోనే భయపడి లోయలోకి దూకేశారు. కాగా లోయలో పడిన భార్యాభర్తలిద్దరికీ గాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. రాహుల్‌ వెన్నెముకకు గాయం కాగా, అతడి భార్య కాళు విరిగింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో వీడియో తీయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఫొటోల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయరా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News