Viral Video: వాషింగ్ మిషిన్‌లో దర్శనమిచ్చిన అనుకోని అతిథి.. డోర్‌ తీసి చూడగా షాక్‌

రాజస్థాన్‌లో కోటాలో ఓ ఇంట్లోని వాషింగ్ మిషిన్‌లో అనుకోని అతిథి దర్శనమిచ్చింది. దుస్తులు వేద్దామని వాషింగ్ మిషిన్‌ డోర్‌ ఓపెన్ చేసిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది.

Update: 2024-08-22 17:45 GMT

 Viral Video: వాషింగ్ మిషిన్‌లో దర్శనమిచ్చిన అనుకోని అతిథి.. డోర్‌ తీసి చూడగా షాక్‌ 

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వర్షా కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని పాములు ప్రజల మధ్యకు వచ్చేస్తున్నాయి. దీంతో చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ కెమెరాల్లో వాటిని బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే వైరల్‌ అవుతోంది.

రాజస్థాన్‌లో కోటాలో ఓ ఇంట్లోని వాషింగ్ మిషిన్‌లో అనుకోని అతిథి దర్శనమిచ్చింది. దుస్తులు వేద్దామని వాషింగ్ మిషిన్‌ డోర్‌ ఓపెన్ చేసిన కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. ఇంతకీ అందులో ఏముందనేగా. శంభుదయాల్ అనే వ్యక్తి కోటాలోని స్వామి వివేకానంద నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే శంభుదయాళ్‌ బట్టలు లాండ్రీకి వేసేందుకు ఇంట్లోని వాషింగ్‌ మెషీన్‌ను తెరిచాడు.

అంతే అందులో అప్పటికే 5 అడుగుల ఓ భారీ నాగుపాము ఉంది. పడగవిప్పి బుసలు కొడుతూ ఉండడంతో గుండె జారినంత పనైంది. ఇది చూసిన శంభుదయాళ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఇంటికి సమీపంలోని పాములు పట్టే వ్యక్తి గోవింద్‌ శర్మకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న గోవింద్‌ శర్మ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం వాషింగ్ మిషిన్‌లో ఉన్నా పాముచూసి, అతికష్టం మీద దాన్ని సురక్షితంగా పట్టుకుని పామును తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టాడు. వాషింగ్‌ మెషీన్‌లో పాము బుసలు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మన జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురైతే పరిస్థితి, ఊహించుకుంటేనే భయమేస్తోంది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News