బోన్ క్యాన్సర్‌తో సతమతమవుతున్న పులి
*ఉదయ్‌పూర్ సజ్జనార్ జూపార్కులో పులి విలాపం
Tiger: మనిషి ఆరోగ్యంగా ఉన్నపుడు తెగువ, తేజస్సు వేరు. అనారోగ్యంతో నీరసించిన తర్వాత స్థోమతను బట్టి ఆస్పత్రికెళ్లి చికిత్సచేయించుకునే ప్రయత్నం చేస్తారు. అదే నోరులేని మూగజీవాలకు అనారోగ్యాన్ని ఎవరు పట్టించుకుంటారు? మునుషుల్లాగే జంతుజాలాలు అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాయనే విషయం నిశితంగా పరిశీలిస్తేగానీ పశువైద్యులకు తెలియదు. దాని పేరు చెబితేనే చాలు ప్రతిఒక్కరికీ భయం.
ఆ వన్యప్రాణి పులి ఉదయ్‌పూర్ సజ్జనార్ జూపార్కులో హావభావాలను ప్రదర్శించి ఎంతో మందిని మురిపించి ఈ పులి ప్రాణాంతక వ్యాధితో సతమతమవుతోంది. ఆరోగ్యంతో ఉన్నపుడు గర్జించే పులి, అనారోగ్యంతో నీరసించిపోయింది. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. మరణానికి చేరువుతున్నామని ఆపులికి తెలియదు. బతికి ఉన్నన్నాళ్లు పులిగాంభీర్యానికి సాటిలేదనే మాటకు నిలువుటద్దంగా జూలో తిరగాడుతోంది.