Vijay: నేడు తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి సమావేశం
Vijay: చెన్నై శివారు వణయుర్‌లోని పార్టీ కార్యాలయంలో..జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో భేటీకానున్న విజయ్
Vijay: తమిళనాడులో హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి సమావేశం నేడు జరగనుంది. చెన్నై శివారు వణయుర్‌లోని పార్టీ కార్యాలయంలో.. జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలతో విజయ్ భేటీ కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై.. టీవీకే అధ్యక్షుడు విజయ్ నేతలతో చర్చించనున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత తొలి సమావేశం కావడంతో విజయ్ ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ ఆయన అభిమానుల్లో నెలకొంది.