India china Lashes: చర్చలు దిశగా భారత్-చైనా అడుగులు!
సోమవారం లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను సామరశ్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సోమవారం లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను సామరశ్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మేజర్ జనరల్స్ గురువారం చర్చలకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల సమాచారం మేరకు సరిహద్దులో శాంతిని నెలకొల్పే దిశగా చర్చలు జరుగుతున్నట్లు పలు ఆంగ్ల వెబ్సైట్లు రాశాయి. ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండే విధంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు హింసాత్మకంగా మారాయి .. అవి యుద్ధానికి దారితీయకుండా నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో చర్చలకు ఉపక్రమించినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా సోమవారం భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. అదే సమయంలో చైనాకు చెందిన 40 మంది దాకా సైనికులు భారత్ చేతిలో మరణించారు.