రాష్ట్రపతి పాలన విధించాలనే పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముగ్గురు ఢిల్లీ నివాసితులు దాఖలు చేసిన పిటిషన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను..

Update: 2020-10-16 08:30 GMT

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముగ్గురు ఢిల్లీ నివాసితులు దాఖలు చేసిన పిటిషన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కోరుతూ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని తొలగించాలని పేర్కొంది. కాగా న్యాయవాదులు రిషబ్ జైన్, గౌతమ్ శర్మ, సామాజిక కార్యకర్త విక్రమ్ గహ్లోట్ దాఖలు చేసిన పిటిషన్ లో మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా క్షేణించాయని ఆరోపించారు.

ఈ సందర్బంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, కంగనా రనౌత్ బంగ్లా కూల్చివేత, అలాగే భారత నేవీ మాజీ అధికారి మదన్ లాల్ శర్మపై దాడి గురించి వారు తమ పిటిషన్ లో ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతోనే ఈ ఘటనలు జరిగాయని అందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని పేర్కొన్నారు. ఈ అభ్యర్ధనను తిరస్కరించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే పిటిషనర్లతో ఈ విషయంపై 'మీరు రాష్ట్రపతిని అడగవచ్చు' అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

Tags:    

Similar News