Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Same-Sex Marriage: ప్రత్యేక వివాహాల చట్టాన్ని మేము రద్దు చేయలేము
Same-Sex Marriage: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. స్వలింగ వివాహాలపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నాలుగు వేర్వేరు తీర్పులు వెలువరించారు. వివాహల అంశంపై పార్లమెంటు చట్టం చేయాలి.. ప్రత్యేక వివాహ చట్టంపై పార్లమంటే నిర్ణయం తీసుకోవాలని సీజేఐ వ్యాఖ్యానించారు. శాసన వ్యవస్థలో మేము జోక్యం చేసుకోలేమని.. ప్రత్యేక వివాహాల చట్టాన్ని మేము రద్దు చేయలేమన్నారు జస్టిస్ డి.వై.చండ్రచూడ్. జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ప్రతి ఒక్కరుకుంది.. వివాహ హక్కుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్పు చేయలేము.. అయితే ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదు అని సీజేఐ స్పష్టం చేశారు.