Indonesia: ఇండోనేషియాలో లోయలో పడ్డ బస్సు - 26 మంది మృతి

Indonesia: ఇండోనేషియాలో బస్సు లోయలో పడిపోవడంతో 26మంది దుర్మరణం పాలయ్యారు.

Update: 2021-03-11 09:58 GMT
Road Accident in Indonesia: Indonesia bus crash kills 26

రోడ్ ఆక్సిడెంట్ ఇన్ ఇండోనేషియా 

  • whatsapp icon

Road Accident in Indonesia: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో 26 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని జావా దీవిలో అర్ధరాత్రి యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 26మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మందికి గాయాలయ్యాయని సుమేడాంగ్‌ జిల్లా పోలీస్‌ అధికారి తెలిపారు.

బుధవారం అర్ధరాత్రి సుమేడాంగ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి లోయలో పడిపోయిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను లోయ నుంచి వెలికితీశారు. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Tags:    

Similar News