మీ స్వీట్లు మాకొద్దు.. పాక్ తలబిరుసు!

జాతీయ, సాంస్కృతిక వేడుకల సందర్భంగా దాయాది దేశం పాకిస్థాన్ తో స్వీట్లు పంచుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. ఎప్పుడూ ఈ కార్యక్రమం వాఘా-అటారీ సరిహద్దుల వద్ద ఘనంగా జరిపేవారు.

Update: 2019-08-12 15:21 GMT

జాతీయ, సాంస్కృతిక వేడుకల సందర్భంగా దాయాది దేశం పాకిస్థాన్ తో స్వీట్లు పంచుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. ఎప్పుడూ ఈ కార్యక్రమం వాఘా-అటారీ సరిహద్దుల వద్ద ఘనంగా జరిపేవారు. అయితే, ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ భారత్ పై విషం కక్కుతోంది. అయినా సరే, భారత్ మాత్రం సంప్రదాయలకే విలువిచ్చింది. బక్రీద్ సందర్భంగా స్వీట్లు పంచుకోవడానికి గానూ, అటారీ సరిహద్దుల వద్ద ఉన్న బీఎస్ఎఫ్ అధికారులు తమ నిర్ణయాన్ని ఇస్లామంబాద్ లోని పాక్ అధికారులకు తెలియపరిచారు. అయితే, వారు దీనికి నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సైనికుల్ ఆమధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని ఈ సందర్భంగా పాకిస్థాన్ అధికార్లు స్పష్టం చేశారట. కాగా, గత జూన్ లో రంజాన్ సమయంలో ఇరు దేశాల సైనికులు స్వీట్స్ పరస్పరం పంచుకున్నారు.


Tags:    

Similar News