నవంబర్ 15 వరకు వడ్డీలు చెల్లించాల్సిన అవసరంలేదు : సుప్రీం కోర్టు

ఆరునెలల లాక్డౌన్ సమయంలో లోన్ మారటోరియం ఎంచుకున్న వారికి భారత అత్యున్నత న్యాయస్థానం శుభవార్త అందించింది. నవంబర్ 15 వరకూ..

Update: 2020-10-15 10:50 GMT

ఆరునెలల లాక్డౌన్ సమయంలో లోన్ మారటోరియం ఎంచుకున్న వారికి భారత అత్యున్నత న్యాయస్థానం శుభవార్త అందించింది. నవంబర్ 15 వరకూ వడ్డీపై వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అలాగే రూ. రెండు కోట్ల రూపాయల వడ్డీ పై వడ్డీ మాఫీపై నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నెల రోజుల గడువు కోరింది.. దీనికి నెల సమయం ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, తాము వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. నవంబర్ 15 వరకు ఎవరి రుణాల ఖాతాలను నిరర్ధక ఆస్తిగా ( NPA ) ప్రకటించకూడదని కోర్టు సూచించింది. విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ), బ్యాంకుల తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసు విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించగా.. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 2న జరుగుతుందని సుప్రీంకోర్ట్ తెలిపింది. 

Tags:    

Similar News