Kedarnath: కేదార్‌నాథ్‌లో తప్పిన పెను ప్రమాదం

Kedarnath: భయంతో పరుగులు తీసిన భక్తులు

Update: 2024-05-24 07:45 GMT

Kedarnath: కేదార్‌నాథ్‌లో తప్పిన పెను ప్రమాదం

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ హెలికాప్టర్ గాల్లో గింగిర్లు కొట్టింది. దీంతో కింద ఉన్న భక్తులు భయంతో పరుగులు పెట్టారు. పైలట్ చాకచక్యంగా సేఫ్‌గా ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ట్రెకింగ్ చేయలేని భక్తులు హెలికాప్టర్‌లో ఆలయం వద్దకు వెళతారు.

శుక్రవారం ఉదయం పైలట్ సహా ఏడుగురితో సిర్సి హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్ వెళుతున్న హెలికాప్టర్ సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలోని హెలిప్యాడ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. పైలట్ సహా విమానంలోని ఏడుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News