Top 6 News @ 6 PM: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత: మరో 5 ముఖ్యాంశాలు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-10-13 12:34 GMT

Top 6 News @ 6 PM: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత: మరో 5 ముఖ్యాంశాలు

1.టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సీఐడీ అప్పగింత

తెలుగుదేశం పార్టీపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ రెండు కేసులను మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయంపై వైఎస్ఆర్ సీపీ కార్యాలయంపై దాడికి దిగాయి. వైఎస్ఆర్‌సీపీ నాయకులు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారని అప్పట్లో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితరులు తమ అనుచరులతో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోజోగి రమేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అక్టోర్ 14న పోలీసులు సీఐడీకి అప్పగించనున్నారు.

2.మాజీ మంత్రి బాబాసిద్దిఖీ హత్య చేసింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

మాజీ మంత్రి బాబా సిద్దిఖీని తామే హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అక్టోబర్ 12 రాత్రి ముంబైలోని బాంద్రాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సిద్దిఖీ మరణించారు. హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు యూపీకి చెందిన శివకుమార్ ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. బాబా సిద్దిఖీ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడు.

3.బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ కు మెయిన్ హర్డ్ సంస్థ లీగల్ నోటీసులు

భారత రాష్ట్ర సమితి నాయకులు మన్నె క్రిశాంక్ మెయిన్ హర్డ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని నిర్ణయం తీసుకుంది.తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆరోపణలు చేశారని మెయిన్ హార్డ్స్ సంస్థ తెలిపింది.క్రిశాంక్ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఎక్స్ లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే సివిల్, క్రిమినల్ పరంగా న్యాయపరమైన చర్యలకు వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నోటీసుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.

4. బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అక్టోబర్ 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

5. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్: పాల్గొన్న ప్రముఖులు

తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశ్యమని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బండారు విజయలక్ష్మి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దసరా అంటే పాలపిట్ట, జమ్మిచెట్టు గుర్తుకు వస్తుంది. అలయ్ బలయ్ అంటే గుర్చొచ్చేది బండారు దత్తాత్రేయ అని ఆయన గుర్తు చేశారు. గతంలో ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహించేవారు. కానీ, గత మూడు నాలుగేళ్లుగా దత్తాత్రేయ కూతురు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న విజయలక్ష్మిన ఆయన అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా , తెలంగాణ, ఉత్తరాఖండ్,గవర్నర్లు బండారు దత్తాత్రేయ, జిష్ణుదేవ్ వర్మ, గుర్మిత్ సింగ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

6. ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజుతో రూ. 1797 కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో 3396 మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ధరఖాస్తు ఫీజు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం జిల్లాలోని 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 113 దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు వచ్చాయి.వీటిని పున:పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అక్టోబర్ 14న లాటరీ తీస్తారు. ఈ నెల 16న రాష్ట్రంలోని నూతన మద్య విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్ ను రూ.99 లకు విక్రయించేలా సవరించింది.

Tags:    

Similar News