TOP 6 News @ 6PM: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు... రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సాయం.. మరో 4 ముఖ్యాంశాలు

Update: 2024-12-25 13:00 GMT

1) Jani Master Case Updates: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం

Hyderabad Police Filed Chargesheet in Jani Master Case: జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ నార్సింగ్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈవెంట్స్ పేరుతో బాధితురాలిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాల్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

2) Allu Arjun Updates: రేవతి కుటుంబానికి సాయం ప్రకటించిన అల్లు అర్జున్

Allu Arjun's Sandhya Theatre Stampede Case latest news updates: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం అందించనున్నట్లు పుష్ప 2 మూవీ యూనిట్ ప్రకటించింది. ఇందులో అల్లు అర్జున్ వైపు నుండి రూ. 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున రూ. 50 లక్షలు, అలాగే ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇవాళ దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్, దిల్ రాజు ఈ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప మూవీ యూనిట్ నుండి ఎవరెవరు ఎంత సాయం అందిస్తున్నారనే వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున తాము చట్టరీత్యా ఆ కుటుంబాన్ని కలవొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రతినిధి అయిన తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజును మధ్యవర్తిగా తీసుకొచ్చినట్లు చెప్పారు (Dil Raju meets Revathi's family).

3) Hyderabad Police: సంధ్య థియేటర్ ఘటనపై నెటిజెన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad CP CV Anand warning to netizens in Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని తాజాగా హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రాకముందే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

4) Arvind Kejriwal: త్వరలో ఢిల్లీ సీఎం అతిషి అరెస్ట్

Arvind Kejriwal alleges Delhi CM Atishi will be arrested soon: త్వరలో ఢిల్లీ సీఎం అతిషిని అరెస్ట్ చేస్తారంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. అతిషి అరెస్ట్ కంటే ముందు కొందరు నేతల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తారంటూ ఆరోపించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ దక్కడంతో అది చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని కేజ్రీవాల్ ఎక్స్ ద్వారా అభిప్రాయపడ్డారు. అందుకే అతిషిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు.

5) ఆప్‌తో కూటమి పొరపాటు చేశాం - కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసి తప్పు చేశామని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అరవింద్ కేజ్రీవాల్ పేరును ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన్ను ఫర్జివాల్ అని పిలవొచ్చు అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల తమ వైఖరిని స్పష్టంచేస్తూ కాంగ్రెస్ పార్టీ 12 పేజీలతో వైట్ పేపర్ రిలీజ్ చేసింది. మౌకా మౌకా హర్ బార్ ధోకా అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ శ్వేతపత్రంలో కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

6) Plane Crash: కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం

కజకిస్తాన్‌లో బుధవారం విమానం కుప్పకూలింది. కూలిన విమానం అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంగా గుర్తించారు ( Azerbaijan Airlines Flight Crashed in Kazakstan). ప్రమాదం జరిగిన సమయంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 32 మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మరో 30 మంది గాయాలతో బయటపడినట్లు సమాచారం అందుతోంది.

Tags:    

Similar News