PM Modi: వాజ్‌పేయి పేరు మీద స్మారక నాణెం, తపాలా స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ
PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100నాణేలను ప్రధాని విడుదల చేశారు.
PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100నాణేలను ప్రధాని విడుదల చేశారు. దీంతో పాటు 1153 అటల్ గ్రామసభ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇది గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది స్థానిక స్థాయిలో సుపరిపాలనను కూడా ప్రోత్సహిస్తుంది.
ప్రారంభోత్సవం, శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెన్-బెత్వా రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రివర్స్ ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది.
అభివృద్ధికి కొత్త ఊపు
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ఏడాది కాలంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే నేడు ఇక్కడ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. కెన్-బెట్వా లింక్ కూడా ఆమోదించచడం జరిగిందన్నారు. ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్‌లో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్ట్ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది 2070 నాటికి భారతదేశ నికర సున్నా కార్బన్ ఉద్గారాల మిషన్‌కు దోహదం చేస్తుంది. అంతేకాకుండా నీటి సంరక్షణకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. ఇది నీటి ఆవిరిని తగ్గిస్తుంది. దీని వల్ల లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని మోదీ చెప్పారు.
కర్బన ఉద్గారాలు తగ్గుతాయిPM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద స్మారక పోస్టల్ స్టాంప్, రూ.౧౦౦ నాణేలను ప్రధాని విడుదల చేశారు.