Amit Shah: అమిత్ షా ఇక లేరని పోస్ట్ పెట్టి అరెస్ట్ అయ్యారు

Man posted fake news about Amit Shah's death to gain followers: అమిత్ షా ఇక లేరని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన రోహిత్ అనే వ్యక్తిని బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-25 15:30 GMT

Man posted fake news about Amit Shah's death to gain followers: అమిత్ షా ఇక లేరని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన రోహిత్ అనే వ్యక్తిని బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా ఇక లేరని మంగళవారం ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై బీజేపి నేత అనిల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఘజియాబాద్ పోలీసులు.. ఐపి అడ్రస్ ఆధారంగా మొరాదాబాద్‌కు చెందిన 34 ఏళ్ల రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఇందిరాపురం అసిస్టెంట్ కమిషనర్ స్వతంత్ర కుమార్ సింగ్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.

రోహిత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు చెప్పిన విషయం విని నోరెళ్లబెట్టారు. ఫేస్ బుక్ పేజీపై ఫాలోవర్స్ పెంచుకునేందుకే ఇలా అమిత్ షా చనిపోయినట్లుగా ఈ ఫేక్ న్యూస్ పోస్ట్ పెట్టానని రోహిత్ అంగీకరించారు. అది విని పోలీసులు షాక్ అయ్యారు. ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఎవరైనా ఇలాంటి పని చేస్తారా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం రోహిత్ చేసిన పని అతడిని జైలు కటకటాలు లెక్కబెట్టేలా చేసింది. 

Tags:    

Similar News