TOP 6 News @ 6PM: అల్లు అర్జున్ కేసులో ప్రభుత్వంపై ఆరోపణలకు దిల్ రాజ్ సమాధానం

Update: 2024-12-24 12:47 GMT

1) Dil Raju About Allu Arjun case: ఫిలింనగర్‌కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్? స్పందించిన దిల్ రాజు

రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు చెప్పారు. మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. బాధితుడి తండ్రి భాస్కర్‌ను ఓదార్చారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమని ఆయన అన్నారు. అమెరికా నుంచి రాత్రే తాను హైదరాబాద్‌కు వచ్చానని ఇవాళ ఉదయం సీఎంను కలిశానన్నారు. రేపు లేదా ఎల్లుండి మరోసారి సీఎం రేవంత్‌ను కలిసి సంధ్య థియేటర్ ఘటనపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అల్లు అర్జున్‌ను కూడా కలుస్తానని అన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Allu Arjun case: ముగిసిన అల్లు అర్జున్ విచారణ

Allu Arjun case investigation: సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసుతో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ఆయన్ను ప్రశ్నించినట్టు సమాచారం. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అల్ప పీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

4) Ap Fibernet: ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది తొలగింపు

Ap Fibernet: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడిందని జీవిరెడ్డి ఆరోపించారు. అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్దంగా నియమాకాలు జరిపారని విమర్శించారు. ఆఫర్ లెటర్, అపాయింట్ మెంట్ కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని ఆయన చెప్పారు.

5) Kolkata Doctor Rape and Murder Case: సీబీఐ చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్... ఆధారమే లేదన్న నివేదిక

Kolkata Doctor Rape and Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించిన నాలుగవ అంతస్తులోని సెమినార్ రూంలో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక వెల్లడించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. నేరం జరిగిన ప్రదేశం సెమినార్ రూమ్ కాకపోవచ్చుననే సందేహాలను వ్యక్తం చేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

6) Effel Tower catches fire: ఈఫిల్ టవర్‌లో అగ్రి ప్రమాదం.. పరుగులు తీసిన పర్యాటకులు

ఈఫిల్ టవర్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అక్కడి నిర్వాహకులు 12000 మంది పర్యాటకులను హుటాహుటిన అక్కడి నుండి ఖాళీ చేయించి దూరం పంపించారు. పర్యాటకులు పరుగులు తీయడంతో అక్కడ గందరగోళమైన వాతావరణం నెలకొంది. ఈఫిల్ టవర్ మొదటి అంతస్తు, రెండో అంతస్తు మధ్య ఎలివేటర్ షాఫ్టులో మంటలు చెలరేగినట్లు ఫ్రాన్స్ పోలీసులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News