Bank Holidays: మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ నెల ముగిసి..కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. మరి జనవరి నెలలో బ్యాంకు సెలవులు ఎన్ని ఉంటాయో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్య్కూలర్ 2025 ప్రకారం ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకులు జనవరి నెలలో కొన్నిరోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈనెలలో భారీగా సెలవులు వచ్చాయి. ఆర్బిఐ ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో వేర్వేరుగా సెలవులు వచ్చాయి. కాబట్టి తరుచుగా బ్యాంకుల్లో లావాదేవీలు నడిపేవారు, వ్యాపారవేత్తలకు బ్యాంకు సెలవులపై ఓ అవగాహన ఉండాలి. లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంటుటంది. అందుకే బ్యాంకు హాలిడేస్ గురించి పూర్తి సమాచారం మీకోసం
మీ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు సందర్శనల నిర్వహణకు భారతదేశంలో బ్యాంకు సెలవుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో RBI, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు), చిన్న ఆర్థిక బ్యాంకులు (SFBలు) మరిన్ని వంటి వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి. భారతదేశంలో బ్యాంకు సెలవులు జాతీయ సెలవులు (గెజిటెడ్ సెలవులు) ప్రభుత్వ సెలవులు (రాష్ట్ర మరియు కేంద్ర రెండూ) ఉన్నాయి.
ప్రభుత్వ సెలవులను రెండు రకాలుగా విభజించవచ్చు - రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు, కేంద్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు. రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకుల సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి. ఇవి కాకుండా, భారతీయ బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారం మూసిఉంటాయి.
జనవరి 1 బుధవారం న్యూఇయర్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. 2వ తేదీ మిజోరాంలో కొత్త సంవత్సరం హాలుడే ఉంది. కేరళలో మన్నం జయంతి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంది. జనవరి 5వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. 6వ తేదీ సోమవారం గురుగోవింద్ సింగ్ జయంతి ఆరోజు హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. జనవరి 11వ తేదీన రెండో శనివారం ఆరోజు బ్యాంకులకు సెలవు. 12వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు. జనవరి 14వ తేదీ మంగళవారం సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. జనవరి 15వ తేదీ బుధవారం కూడా సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ మఘ్ బిహు సందర్బంగా అసోం, తిరువళ్లువార్ డే సందర్భంగా తమిళనాడులో బ్యాంకులు సెలవు ఉంది.
జనవరి 16వ తేదీ గురువారం కనుమ రోజు ఏపీ, ఉజ్జవర్ తిరునాల్ సందర్భంగా తమిళనాడులో బ్యాంకులకు సెలవు ఉంది. ఆ తర్వాత జనవరి 19వ తేదీ ఆదివారం మరో సెలవు వస్తోంది. జనవరి 22వ తేదీ బుధవారం ఇమో ఇను ఇరత్స సందర్భంగా మణిపూర్ లో బ్యాంకులకు సెలవు ఉంది. జనవరి 23వ తేదీ గురువారం గాన్ నగై సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ఒడిశా, పంజాబ్, త్రిపుర, సిక్కిం, బెంగాళ్, జమ్మూకశ్మీర్, ఢిల్లీలలో బ్యాంకులకు సెలవు ఉంది.
జనవరి 25వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉన్నాయి. జనవరి 26వ తేదీ అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా అన్ని బ్యాంకులు సెలవు ఉంది. జనవరి 30వ తేదీ గురువారం సోమన్ లోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ఉంది.