Baba Siddique : సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ మధ్య వివాదం పరిష్కరించిన బాబా సిద్దిఖీ..ఎలాగో తెలుసా

Baba Siddique shot dead : మహారాష్ట్రలో కీలక నేత బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన రాజకీయ నేత మాత్రమే కాదు..బాలీవుడ్ లో ఎన్నో సమస్యలను పరిష్కరించిన మధ్యవర్తిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. సల్మాన్-షారుక్ ఖాన్ మధ్య వివాదాన్ని పరిష్కరించింది బాబా సిద్దిఖీనే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-10-13 02:35 GMT

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కాల్పులు జరిపిన తరువాత, బాబా సిద్ధిఖీని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అయినా వైద్యులు అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆయన వయస్సు 66 ఏండ్లు. బాబా సిద్దిఖీ ఒక రాజకీయనేత, మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు..బాలీవుడ్ లో మధ్యవర్తిగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ ల మధ్య నెలకున్న కోల్డ్ వార్ ను బాబా సిద్దిఖీ అంతం చేసిన విధానం గురించి నేటికీ చాలా మంది చర్చించుకుంటున్నారు.

అసలు విషయం ఏంటంటే

2013లో బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా వీరిద్ధరి మధ్య విభేదాలు వచ్చాని చెబుతుంటారు. బాలీవుడ్ రెండు వర్గాలు వీడిపోయింది. సల్మాన్ షారుఖ్ మధ్య ఈ పవర్ ఫైట్ గురించి నిర్మాతలు కూడా ఆందోళన చెందారు. ఈ విషయం బాబా సిద్దిఖీ వరకు చేరింది. ఆయన సపోర్టు కావాలని కొంతమంది సినీ ప్రముఖులు ఆయన్ను అడిగారు. సినిమాకు పెద్దగా సంబంధం లేని ఈ వ్యక్తి వారిద్దరి మధ్య వివాదాన్ని అంతం చేశారు. అంతేకాదు ఇద్దరు ఖాన్ లను మళ్లీ బాలీవుడ్ లో మంచి స్నేహితులుగా మార్చేశారు.

బాబా సిద్దిఖీ బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఈద్ కు ఆయన ఇచ్చే ఇఫ్తార్ విందు హైలైట్ గా నిలిచేది. సల్మాన్, షారుఖ్ ల మధ్య మధ్య వర్తిత్వం వహించాలని సిద్దిఖీని బాలీవుడ్ వర్గాలు కోరాయి. సమస్యను పరిష్కరించేందుకు రాజకీయ నాయకుడు ఒక ఐడియాను గుర్తించారు. ఈ పార్టీలో సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ పక్కన షారుఖ్ ను కూర్చోబెట్టారు.

సల్మాన్ టేబుల్ దగ్గరికి వచ్చే ముందు షారుఖ్ సలీం ఖాన్ తో కాసేపు మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. షారుఖ్ లేచిన తర్వాత ఇద్దరు స్టార్స్ ఒకరినొకరు కౌగిలించుకుని పలకరించుకున్నారు. అప్పుడు బాబా సిద్దిఖీ వారితో చేరి ఫొటోగ్రాఫర్లకు క్లిక్ చేయమని అడిగారు. ఇలా వారిద్దరి మధ్య కోల్డ్ వార్ అంతం చేశారు.

Tags:    

Similar News