Top 6 News @ 6 PM: ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రివ్యూ.. మెగాస్టార్ విశ్వంభర టీజర్ విడుదల.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
IND vs BAN 3rd T20I: హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ పక్కా..! టీమిండియా గణాంకాలు చూస్తే బంగ్లాకు దిగులే..
India T20 Record in Hyderabad: సిరీస్‌లోని మూడో, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్‌లో తలపడనున్నాయి. బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఉప్పల్‌లో భారత్ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌లోను విజయం తప్పనిసరి అని తెలుస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో సులువైన విజయాలు నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. మూడో మ్యాచ్‌ని అక్టోబర్ 12న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP liquor Shop Tenders: మద్యం టెండ్ల దరఖాస్తుకు ముగిసిన గడువు.. ప్రభుత్వానికి రూ.1,792 కోట్ల ఆదాయం
AP liquor Shop Tenders: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి ఏడుగంటలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి 87వేల 986 దరఖాస్తులు అందాయి. రాత్రి 11 గంటలకు ఈ సంఖ్య 89వేల 643కు చేరింది. దీంతో నాన్‌రిఫండబుల్ ఫీజుల రూపంలో సుమారు 17వందల 92 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గడువు ముగిసే సమయానికి చాలామంది వ్యాపారులు ఎక్సైజ్ స్టేషన్లలో క్యూలైన్లలోనే ఉన్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Jagityala: ఫారెస్ట్ ఆఫీసులో.. ఉద్యోగుల దావత్..!
ఏ ఫంక్షన్ అయినా విందు చేసుకోవడం ఆనవాయితీ.. విందులో మద్యం, మాంసం ఉండడం మామూలే.. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో దావత్ చేసుకోవడం క్షమించరాని నేరం.. తమ ఆఫీసును గుడిలా భావించాల్సిన అధికారులు, సిబ్బంది అక్కడే దావత్ చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయ ఆవరణలో ఉన్న మైసమ్మ వారికి మేకను బలి ఇచ్చి.. మద్యంతో విందు చేసుకోవడం విమర్శలకు దారితీసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తలపించింది. కొందరు అటవీశాఖ అధికారులు తమ ఆఫీసు ఆవరణలోనే దావత్ చేసుకున్నారు. అక్కడే ఉన్న మైసమ్మకు మేకను బలి ఇచ్చారు. మద్యంతో ఎంచక్కా దావత్ చేసుకుని సంతోషంగా గడిపారు. విందు చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేనప్పటికీ.. జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలోనే మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Revanth Reddy: సొంతూరికి సీఎం.. కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుగనున్న దసరా వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ సొంత గ్రామానికి మరి కాసేపట్లో వెళ్లనున్నారు. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం... కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
నూతన గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేయనున్నారు. కొండారెడ్డి పల్లిని సౌరవిద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 కోట్ల రూపాయల సొంత నిధులతో హనుమాన్ దేవాలయ నిర్మించారు సీఎం.. అయితే సీఎం రేవంత్ రాక కోసం గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ వెళ్లనుండడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం మొదలైంది.. పోలీసులు పహరా కాస్తున్నారు.
Tamil Nadu Train Accident : ఎక్స్‌ప్రెస్ ట్రైన్ గూడ్స్ రైలుని ఎలా ఢీకొట్టింది? 75 కిమీ వేగంతో లూప్ లైన్‌లోకి ఎందుకెళ్లింది?
Tamil Nadu Train Accident: మైసూర్-దర్భంగ బాగమతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పిన ఘటన రైల్వే అధికారులకు ఒకరకంగా మిస్టరీగా మారింది. చెన్నై నుండి బయలుదేరిన రైలు కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. తమిళనాడు రైలు ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తుండటంతో అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానంతోనే ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో రైలు పట్టాలపై కుట్ర కోణాలు వెలుగుచూస్తుండటంతో తమిళనాడు రైలు ప్రమాదం వెనుక అలాంటి కోణం ఏదైనా ఉందా అని నిగ్గుతేల్చే పనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Viswambhara: దసరా పండుగకు మెగా ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్.. విశ్వంభర టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్..
దసరా పండుగ రోడు మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ డేను ప్రకటించిన చిత్రయూనిట్... చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న విశ్వంభర టీజర్‌ను విడుదలచేశారు. అందరూ ఎదురు చూస్తున్న అతని రాక..... ఓ వేడుక అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. విశిష్ట దర్శకత్వంలో విజువల్ వండర్, సోషియో ఫాంటసీ త్రిల్లర్, యాక్షన్ అడ్వెంచర్ మువీగా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు. విశ్వంభర టీజర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.