Ratan Tata: రతన్ టాటా చనిపోవడానికి ముందు చేసిన చివరి ట్వీట్ ఇదే..
Ratan Tata: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు.
Ratan Tata: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు రాగా.. వాటిపై రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు. సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన లాస్ట్ పోస్టు వైరల్ అవుతుంది. రతన్ టాటా చనిపోవడానికి ముందు చేసిన చివరి ట్వీట్ ఇదే.
‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు (Thank You For Thinking Of Me)’ అని రతన్ టాటా పేర్కొన్నారు.