GN Saibaba: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతిపై ప్రముఖుల స్పందన

GN Saibaba: మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8.45 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు నిమ్స్ వైద్యులు ధ్రవీకరించారు. సాయిబాబా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Update: 2024-10-13 06:30 GMT

GN Saibaba: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతిపై ప్రముఖుల స్పందన

GN Saibaba:  మానవ హక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 8.45 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు నిమ్స్ వైద్యులు ధ్రవీకరించారు. సాయిబాబా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సమయంలో సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ విధుల్లో నుంచి తొలగించింది. 2021లో పూర్తిగా విధులను నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 90శాతం వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతోపాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయల్ కోర్టు జీవితఖైదు విధించింది. 2017 నుంచి నాగ్ పూర్ జైలులోనే ఉన్నారు సాయిబాబా.

కాగా సాయిబాబా మరణంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రముఖ రచయిత్రి మీనా కందస్వామి, ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాడ్ స్పందించారు.

సీపీఐ నారాయణ:

ప్రొఫెసర్ సాయిబాబా మరణం పట్లు సీపీఐ నారాయణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నిజజీవితంలో వికాలంగుడయినా ప్రభుత్వ నిర్భందాన్ని ఎదిరించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. అయితే తన శరీరంతో ఓడిపోయారన్నారు నారాయణ. పోరాటయోధులు సాయిబాబా భౌతికంగా మనతో లేకున్నా ఆయన పోరాట స్పూర్తి ఎప్పటికీ గుర్తు ఉంటుందన్నారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు :

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమనేత జీఎన్ సాయిబాబా మరణంపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. వారి మరణం సమాజానికి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.

మీనా కందస్వామి:

మానవ హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మ్రుతి పట్ల కవి, రచయిత, సామాజిక ఉద్యమకారిణి మీనా కందసామి విచారం వ్యక్తం చేశారు. 90శాతం వైకల్యంతో ఒక దశాబ్దంపాటు జైలు జీవితాన్ని గడిపారని, రాజ్యం ఆయన పట్ల కర్కషంగా వ్యవహరించినా మొక్కవోని దీక్షతో అన్యాయాన్ని ఎదిరించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.


తీస్తా సీతల్వాడ్

మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతి పట్ల ప్రముఖ ఉద్యమకారిణి, జర్నలిస్టు తీస్తా సీతల్వాడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె తన ట్విట్టర్ ద్వారా మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. ఆయన జీవితకాల పోరాటానికి రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.



Tags:    

Similar News