Top 6 News @ 6PM: సికింద్రాబాద్ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం- ఉద్రిక్తత.. ఏపీకి మరోసారి తుపాను ముప్పు
సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది.
1) Defamation Case: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా: ఈ నెల 18న స్టేట్‌మెంట్ రికార్డు
Defamation Case: కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. సినీనటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అక్టోబర్ 14న విచారించింది కోర్టు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రిపై బీఎన్ఎస్ యాక్ట్ 356 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో ఆయన కోరారు.
2) Secunderabad: కుమ్మరిగూడలో ఉద్రిక్తత, ఆందోళనకారుల అరెస్ట్..
Muthyalamma Temple Idol Vandalised : సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు. . సంఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తదితరులు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా అక్కడికి చేరుకుని సంఘటనస్థలాన్ని పరిశీలించారు.
అమ్మవారి ఆలయంలో విగ్రహాం ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. అమ్మవారి ఆలయంలో విగ్రహాం ధ్వంసం వెనుక కుట్రను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
3) Professor GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్‌కు డొనేట్.. కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం
Professor GN Saibaba: మౌలాలి జవహర్‌నగర్‌లోని శ్రీనివాస హైట్స్‌కు ప్రొఫెసర్ సాయిబాబ భౌతికకాయన్ని తరలించారు. కడసారి చూసేందుకు పౌర హక్కుల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమ కారులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సందర్శనార్థం సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచి.. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగించనున్నారు కుటుంబసభ‌్యులు.
సాయిబాబా భౌతిక కాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళి అర్పించారు. జైలు నుంచి వచ్చిన కొన్నాళ్లకే సాయిబాబా మరణించడం బాధాకరమని హరీశ్‌రావు అన్నారు. సమాజంలో మార్పు, హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు.
4) Pawan Kalyan: 'ముందు బాధ్యత, ఆ తర్వాతే వినోదం'.. పవన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న అభిమానులు.. 'ఓజీ' అంటు నినాదాలు చేశారు.
ఆ నినాదాలపై స్పందించిన పవన్.. 'ముందు బాధ్యత.. ఆ తర్వాత వినోదం. సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని.. ఇలా అందరూ బాగుండాలి' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీఎం చంద్రబాబుని కూడా పవన్ కల్యాణ్ ఆకాశానికెత్తారు. పాలన ఎలా చేయాలన్న అంశంలో తనకు సీఎం చంద్రబాబు స్ఫూర్తి అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని పవన్ ఎద్దేవా చేశారు. ఏరోజూ.. వాళ్లు గ్రామసభలు, తీర్మానాలు చేయలేదన్నా పవన్.. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు అపార అనుభవమే బలమని తెలిపారు. పల్లెల అభివృద్ధి కోసం రూ. 4500 కోట్ల విడుదల చేస్తున్నామన్న పవన్ కళ్యాణ్.. ఇది లంచాల ప్రభుత్వం కాదని, నిలబడే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.
5) Rain Alert For AP: ఏపీకి తుపాను ముప్పు.. మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు
Rain Alert: ఏపీపై మరోసారి తుపాన్ ప్రభావం చూపనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలబడి తుపానుగా మారే ఛాన్స్ ఉందని దీని కారణంగా రానున్న మూడు రోజులు ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ తుపాను ప్రభావం ఏఏ జిల్లాలపై ఉంటుందో చూద్దాం.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. ఈ రోజు ఏదొక సమయానికి అల్పపీడనంగా మారే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతానికి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున అల్పపీడనం మరింత తీవ్రమై తుపానుగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు అంటున్నారు.
6) Baba Siddiqui Murder Case: బాబా సిద్దిఖీ హత్యకు పాటియాలా జైలులోనే ప్లాన్… ఎవరీ లారెన్స్ బిష్ణోయ్?
Baba Siddiqui Murder Case: బాబా సిద్దిఖీ హత్యకు పాటియాలా జైలులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హర్యానాకు చెందిన గుర్మైల్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్,ప్రవీణ్ లోంకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు శివ కుమార్, మహమ్మద్ జీషాన్ అక్తర్, శుభం లోంకర్ లు పారిపోయారు. పంజాబ్ సింగర్ మూసేవాలా హత్యతో పాటు పలు హై ప్రొఫైల్ నేరాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలకంగా వ్యవహరించింది.