Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచి..?

Rahul Gandhi: వయినాడ్‌ నుంచి గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాహుల్

Update: 2023-08-19 08:42 GMT

Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచి..?

Rahul Gandhi: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దేశం రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ పోటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. గతంలో అమేథీ ఎంపీగా గెలిచిన రాహుల్‌ గాంధీకు 2019 ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. 2019లో అమేథీ, వయినాడ్‌ నుంచి పోటీ చేయగా.. అమేథీ నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. వయినాడ్‌ నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ వయినాడ్‌ నుంచే పోటీ చేస్తారని కేరళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రకటించారు. మరో వైపు యూపీలోని అమేథీ నుంచే రాహుల్‌ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రకటనలు చేశారు. ఇప్పుడు రాహుల్‌ ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనేది అయోమయంగా మారింది. రాహుల్‌ వయినాడ్‌ నుంచి పోటీ చేస్తే అక్కడి పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపడంతో పాటు సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తుంది.

Tags:    

Similar News