ఐక్యరాజ్యసమితిలో భారత్ విజయం పట్ల మోదీ స్పందన
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎనిమిదవసారి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నిక అయిన సంగతి తెలిసిందే. ఈవిషయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎనిమిదవసారి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నిక అయిన సంగతి తెలిసిందే. ఈవిషయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో 193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో భారత్ 184 ఓట్లు సాధించి భద్రతా మండలిలో అడుగుపెట్టింది. దీంతో ఎలాంటి పోటీలేకుండా భారత్ విజయం సాధించడం గొప్ప పరిణామం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. భద్రతా మండలిలో సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత వంటి అంశాలపై పోరాటంలో భారత తన పంథాను కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉన్నాయి. వీటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు చైనా శాశ్వత సభ్య దేశాలు కాగా.10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఇచ్చారు. వీటిలో భారతదేశం బెల్జియం, కోట్ డి ఐవోర్, జర్మనీ, ఇండోనేషియా, కువైట్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, గినియా, పోలాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.