ఏపీకి కేంద్రం తీపి కబురు.. కష్ట కాలంలో భారీ ఊరట

దేశంలోని 20 రాష్ట్రాల జీఎస్టీ ఆదాయంలోని కొరత తీర్చేందుకు రుణాలు ద్వారా 68.825 కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది.. దీంతో ఆయా రాష్ట్రాలకు రుణం తీసుకునే వెసులుబాటు..

Update: 2020-10-14 04:36 GMT

దేశంలోని 20 రాష్ట్రాల జీఎస్టీ ఆదాయంలోని కొరత తీర్చేందుకు రుణాలు ద్వారా 68.825 కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది.. దీంతో ఆయా రాష్ట్రాలకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది. సోమవారం జరిగిన వస్తు, సేవల పన్ను( జిఎస్‌టి ) కౌన్సిల్ సమావేశం ముగిసిన ఒక రోజు తరువాత ఈ నిర్ణయం వెలువడింది. జిఎస్‌టి అమలు వల్ల తలెత్తే కొరతను తీర్చడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన రెండు ఎంపికలలో ఆప్షన్ -1 ను ఎంచుకున్న రాష్ట్రాలకు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.50 శాతం అదనపు రుణాలు మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 27 న జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో, రెండు ఆప్షన్ లను రాష్ట్రాల ముందుంచింది కేంద్రం.. ఆప్షన్ -1 కోసం ఇరవై రాష్ట్రాలు తమ ప్రాధాన్యతలను ఇచ్చాయి.

ఈ రాష్ట్రాలలో - ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. అయితే, మిగతా రాష్ట్రాలు ఇంకా తమ ఎంపికను తెలియజేయని కారణంగా రుణాల వెసులుబాటు ఇవ్వలేదు. కేంద్ర ప్రతిపాదనకు ఓకే చెప్పిన ఏపీ తన వంతుగా రూ. 5,051 కోట్ల అప్పుగా తీసుకోవడానికి కేంద్ర అనుమతి లభించింది. దీంతో జగన్ సర్కారుకు ఇది భారీ ఊరటనే చెప్పాలి. మరోవైపు ఏఏ రాష్ట్రాలకు ఎంతెంత ఋణం శాంక్షన్ చేశారో ఈ కింది వివరాల్లో ఉంది..

*మహారాష్ట్ర రూ. 15,394 కోట్లు

*ఉత్తరప్రదేశ్ రూ. 9703

*కర్ణాటక రూ. 9018 కోట్లు

*గుజరాత్ రూ. 8704 కోట్లు

*ఆంధ్రప్రదేశ్ రూ. 5051 కోట్లు

*మధ్య ప్రదేశ్ రూ. 4746 కోట్లు

*హర్యానా రూ. 4293 కోట్లు

*ఒడిశా రూ. 2858 కోట్లు

*అసోం రూ. 1869 కోట్లు

*ఉత్తరాఖండ్ రూ. 1405

*హిమాచల్ ప్రదేశ్ రూ. 877 కోట్లు

*గోవా రూ. 446 కోట్లు

*త్రిపుర రూ. 297

*మేఘాలయ రూ. 194

*నాగాలాండ్ రూ. 157 కోట్లు

*సిక్కిం రూ. 154 కోట్లు

*మణిపూర్ రూ. 151 కోట్లు

*అరుణాచల్ ప్రదేశ్ రూ. 143 కోట్లు

*మిజోరాం రూ. 132 కోట్లు 

Tags:    

Similar News