ఛానల్స్ టిఆర్పి రేటింగ్ మూడు నెలలపాటు నిలిపివేత

దేశంలో ఇటీవల టిఆర్పి వివాదం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్..

Update: 2020-10-15 08:30 GMT

దేశంలో ఇటీవల టిఆర్పి వివాదం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ యొక్క టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ ను పన్నెండు వారాల (మూడు నెలలు) పాటు పాజ్ (నిలుపుదల) చేసింది. అన్ని హిందీ, ప్రాంతీయ, ఇంగ్లీష్ న్యూస్ మరియు బిజినెస్ న్యూస్ ఛానెళ్లకు ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ మూడు నెలల కాలంలో అన్ని వార్తా ఛానెల్‌ల రేటింగ్‌లను బార్క్ ప్రచురించదని స్పష్టం చేసింది. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. బార్క్ లో ముఖ్యమైన సంస్కరణలను అమలు చేయడానికి సస్పెన్షన్ కాలం ఉపయోగపడుతుందని ఎన్‌బిఎ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు. కాగా ముంబైలో టిఆర్పికి సంబంధించిన వివాదం బయటపడింది.. ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ల అధినేతలను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. కాగా న్యూస్, మరియు ఎంటర్టైన్మెంట్ చానళ్లకు ఈ రేటింగ్ ఆధారంగానే యాడ్స్ వస్తుంటాయి. అయితే కొంతకాలంగా ఛానల్ రేటింగ్ ను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ వివరణ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముంబైలో రేటింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం చర్చనీయాంశం అయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పలు చానళ్ళు పోలీసులను కోరుతున్నాయి.

Tags:    

Similar News