చైనా చెర నుంచి సైనికులు విడుదల..!
జూన్ 15న హింసాత్మక ఘర్షణల తరువాత ఇద్దరు అధికారులతో సహా పది మంది భారతీయ సైనికులను చైనా సైన్యం అదుపులోకి తీసుకుంది, భారత్‌కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే
జూన్ 15న హింసాత్మక ఘర్షణల తరువాత ఇద్దరు అధికారులతో సహా పది మంది భారతీయ సైనికులను చైనా సైన్యం అదుపులోకి తీసుకుంది, భారత్‌కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు రెండు రోజులుగా చైనా ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపి.. శుక్రవారం ఉదయం పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను విడిపించినట్లు తెలుస్తోంది.
వీరికి ఎటువంటి ప్రమాదం జరగనీయకుండా సైనికులను చైనీయులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా భారత్, చైనా ఘర్షణలో డెబ్బై ఆరు మంది భారతీయ సైనికులు గాయపడ్డారు.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా 15 రోజుల్లో కోలుకొని తిరిగి విధుల్లోకి వస్తారని అధికారులు భావిస్తున్నారు. కాగా సోమవారం చైనా జరిపిన దొంగ దాడిలో 20 మంది మన జవాన్లు అమరులయ్యారు.