Optical illusion: ఈ ఫొటోలో పాము దాగి ఉంది.. కనిపెట్టగలరా.?
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముంది ఎండిన ఒక చెట్టుబెరడు కనిపిస్తోంది అంటారు కదూ! అయితే ఆ చెట్టు బెరుడుపై ఒక పాము దాగి ఉంది.
Optical illusion: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం వైరల్‌గా మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌లో ఎన్నో రకాల ఫొటోలు ఉంటాయి. వీటిలో కొన్ని మన ఆలోచన విధానాన్ని పరీక్షిస్తే, మరికొన్ని మన కంటి పవర్‌ను పరీక్షించేవి ఉంటాయి. తాజాగా ఇలా కంటి పవర్‌ను పరీక్షించే ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముంది ఎండిన ఒక చెట్టుబెరడు కనిపిస్తోంది అంటారు కదూ! అయితే ఆ చెట్టు బెరుడుపై ఒక పాము దాగి ఉంది. ఆ పామును కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే ఆ పాము అచ్చంగా బెరుడు రంగులోనే కలిసిపోయింది. కాబట్టి దానిని గుర్తించడం చాలా కష్టం, అయితే కాస్త ట్రై చేస్తే పామును సులభంగా గుర్తించవచ్చు.
ఒకవేళ మీకు పాము కనిపించకపోతే ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి. బెరడు మధ్యలో చిన్న పాము పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి ఎంత ప్రయత్నించినా పామును కనిపెట్టలేకపోతున్నారా..? అయితే సమాధానం కోసం కింద చూడండి. పాము ఆటోమెటిక్‌గా మీకే కనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి పామును కనిపెట్టండని ఛాలెంజ్ విసరండి. వారి కంటి పవర్‌ను పరీక్షించుకోమని చెప్పండి.