జర్నలిస్టుపై దాడి కేసులో: సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్

మోహన్ బాబు (Manchu Mohanbabu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పును సుప్రీంకోర్టు(superme Court) లో సోమవారం సవాల్ చేశారు.

Update: 2025-01-06 09:01 GMT

జర్నలిస్టుపై దాడి కేసులో: సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్

మోహన్ బాబు (Manchu Mohanbabu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పును సుప్రీంకోర్టు(superme Court) లో సోమవారం సవాల్ చేశారు. మోహన్ బాబు పిటిషన్ పై జనవరి 9న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు 2023 డిసెంబర్ 23న కొట్టివేసింది. అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మోహన్ బాబు ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు మోహన్ బాబు.

జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటికి ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ వెళ్లారు. ఆ సమయంలో గొడవ జరిగిందని మనోజ్ ఆరోపించారు. ఈ విషయమై మీడియాతో, పోలీసులకు మాట్లాడేందుకు వస్తున్నానని ఆయన చెప్పారు. అదే సమయంలో మోహన్ బాబు గేటు బయటకు వచ్చారు. ఈ గొడవపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో మోహన్ బాబు కోపంతో ఆయనపై దాడి చేశారు. బాధితుడు పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News