Sankranti Movies: సంక్రాంతికి సందడే సందడి.. కొత్త సినిమాల హంగామా..!
Sankranti Movies: సంక్రాంతి అంటేనే సినిమాలు. టాలీవుడ్‌లో సంక్రాంతి పండక్కి కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి.
Sankranti Movies: సంక్రాంతి అంటేనే సినిమాలు. టాలీవుడ్‌లో సంక్రాంతి పండక్కి కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతికి థియేటర్లలో సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* ఈ సంక్రాంతికి మోస్ట్ అవేయింట్ మూవీస్ జాబితాలో ఉన్న మొదటి చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినినమా జనవరి 10వ తేదీన ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. రూ. 400 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
* నట సింహం బాలకృష్ట హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ కూడా ఈ సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
* సంక్రాంతి ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతోన్న మరో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఈ సనిమాలో ఐశ్వర రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
ఓటీటీలో..
* ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్) జనవరి 10 నుంచి, లెజెండ్ ఆఫ్ ఫ్లఫ్పీ (స్టాండప్ కామెడీ షో) జనవరి 07 నుంచి, జెర్రీ స్ప్రింగర్ (డాక్యుమెంటరీ) జనవరి 07 నుంచి, ది అన్‌షాప్ 6 (వెబ్‌సిరీస్) జనవరి 09 నుంచి, గూస్‌బంప్స్ (వెబ్‌సిరీస్) జనవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.
* జీ5 వేదికగా సబర్మతి రిపోర్ట్ (హిందీ) జనవరి 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
* ఇక మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫోకస్ (హాలీవుడ్) జనవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* జియో సినిమాలో జనవరి 11వ తేదీ నుంచి రోడీస్ డబుల్ క్రాస్ (రియాల్టీ షో) అందుబాటులోకి రానుంది.
* అదేవిధంగా సోనీలివ్ వేదికగా షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాల్టీ షో) జనవరి 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.