నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా.. 'అనసూయ'తో హైపర్ 'ఆది' రచ్చ!

Update: 2019-12-27 04:53 GMT
Jabardasth Hyper Adi skit (Source:screen shots etv youtube)

జబర్దస్త్ షో లో హైపర్ ఆది స్కిట్ లకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. స్కిట్ ఎలా ఉన్నా సరే, ఆ పదినిమిషాలూ ఆది వేసే పంచ్ లు మాత్రం అందర్నీ నవ్వుల్లో ముంచేస్తాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోవడం కారణమో.. డైరెక్టర్లు కూడా మారిపోవడం వలనో కానీ, జబర్దస్త్ స్కిట్ లలో కొంత ద్వంద్వార్థ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. పోటీ వచ్చిందని భావిస్తున్నట్టున్నారు..పులిహోర స్కిట్ లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 

జబర్దస్త్ తాజా ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎగస్ట్రా జబర్దస్త్ కి రష్మీ..సుధీర్ మధ్య పులిహోర స్టోరీ నడిపిస్తున్నట్టుగానే, జబర్దస్త్ లో అనసూయ..ఆది లతో పులిహోర స్కిట్ లు చేయిస్తున్నారు. ఆ వరుసలోనే ఖుషి సినిమాలో సూపర్ హిట్ సీన్ భూమిక నడుము చూపించే సీన్ ని కలుపుతూ స్కిట్ వదిలారు.

ఇక నల్ల చీర కట్టుకున్న అనసూయ.. బెంచ్ మీద కూచుని పుస్తకం చదువుతుంటే ఆది వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఎగ్జామ్స్ కదా చదువుకుంటున్న అని అనసూయ చెప్పగానే..ఎవరికీ మీ పిల్లలకా అంటూ పంచ్ వేశాడు ఆది. ఇక కొద్దీ సేపటి తరువాత 'నువ్వు నా నడుము చూసావు' అని అనసూయ ఆది తో గొడవకు దిగింది. 'నేను చూడలేదు' అంటూ ఆది చెప్పాడు. ఖుషి టైపులో ఇద్దరూ కొంత వాదులాడుకున్నాకా.. నిజం చెప్పు నా నడుము చూశావు కదూ అని అనసూయ అంటే.. నువ్వు నిజం చెప్పు నన్ను ఇష్టపడ్డావు కదూ అంటూ ఆది రచ్చ రచ్చ చేశాడు. అనసూయ, ఆదిలామధ్య ఈ పులిహోర సీన్ దాదాపు మూడు నిమిషాల పాటు సాగింది. 

ఇక శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో వచ్చి నా నడుము చూసావ్ అని.. తరువాత గణపతి వచ్చి నువ్వు చూశావ్ అని నడుము చొట్టూ పంచ్ ల తో స్కిట్ నడిచింది. గణపతి వచ్చి నా నడుము చూశావ్ అంటే దాన్ని నడుము అంటారా.. జెయింట్ వీలంత ఉంది ఇక్కడున్న అందరూ ఎక్కి తిరగొచ్చు అంటూ ఆది పంచ్ వేశాడు. ఈ పంచ్ కి అతిధులుగా వచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్ పడీ పడీ నవ్వారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే.. అనసూయ-ఆదిల మధ్య నడిచిన పులిహోరే స్కిట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆదితో మాట్లాడుతూ అనసూయ మెలికలు తిరగడం.. అనసూయ తో మాట్లాడుతూ ఆది సిగ్గుపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్.. ఇలా ప్రేక్షకులకు కొంత వినోదాన్ని పంచారు. కానీ, ఖుషి సినిమాలో ఒక్క సీన్ లో ఉన్న నడుము.. స్కిట్ మొత్తం తిప్పేశాడు ఆది. 

ఇక ఈవారం అతిథులుగా వచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్ ఆది స్కిట్ కి విరగబడి నవ్వారు. ఇద్దరూ ఆది ఫ్యాన్స్ అని చెప్పుకున్నారు. మొత్తమ్మీద డబుల్ మీనింగ్ నడుము స్కిట్ తో ఆది ఓ ఆట ఆడుకున్నాడు.

Full View

Tags:    

Similar News