బాలయ్య, నాని రికార్డులను సమం చేసిన మేహరీన్
ఒకే టైంకి ఒకే హీరోకి సంబధించిన సినిమాలు విడుదల కావడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి.
ఒకే టైంకి ఒకే హీరోకి సంబధించిన సినిమాలు విడుదల కావడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పుడు అది కష్టమేమో కానీ అప్పట్లో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. అందులో ఎన్టీఆర్, కృష్ణ నటించిన చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్బాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు 1993 సెప్టెంబర్ 3 నే రిలీజ్ అయ్యాయి. అందులో నిప్పురవ్వ మాములుగా ఆడగా, బంగారు బుల్లోడు సినిమా మంచి హిట్టు అయింది.
ఇక అలాగే హీరో నాని నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు 21 మార్చి 2015న విడుదలయ్యాయి. ఇందులో ఎవడే సుబ్రమణ్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పడు ఆ లిస్టు లోకి ఓ హీరోయిన్ చేరింది. ఆమె మేహ్రీన్ .. ఆమె చేసిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి.
కళ్యాణ్ రామ్‌కు హీరోగా నటించిన ఎంత మంచివాడవురా సినిమా తెలుగులో సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 15 న విడుదలైంది. ఇక తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన పటాస్ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 15 న రిలీజైంది. దీనితో ఈ తరంలో బాలయ్య , నాని రికార్డును సమం చేసిన రికార్డుగా మేహ్రీన్ చరిత్ర సృష్టించింది.
ఇక తెలుగులో ఆమె చేసిన ఎంత మంచివాడవురా సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాని సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించాడు.