Boyapati Srinu: బాలీవుడ్ వద్దు టాలీవుడ్ ముద్దు అంటున్న బోయపాటి
Boyapati Srinu: హీరోయిన్ల కారణంగానే ఆలస్యం అవుతున్న బోయపాటి సినిమా
Boyapati Srinu: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగవ సినిమాగా విడుదలైన "అఖండ" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్లి బాలయ్య కేరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువ హీరో రామ్ తో బోయపాటి ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ గత కొద్ది రోజులుగా బడ్జెట్ కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా పట్టాలెక్కటం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర బృందం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చింది.
ఏజెంట్ ఫేమ్ బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. అయితే సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందని ఆ పాత్ర కోసం ఒక కొత్త హీరోయిన్ ని ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఆ పాత్రల కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ లేదా అనన్య పాండేలను అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణంగా ఆలోచన ను మానుకున్నారు. వాళ్లు సినిమా చేయాలంటే కనీసం నాలుగు కోట్లయినా రెమ్యూనరేషన్ ఇవ్వాలి కానీ కేవలం కోటి రూపాయల లోనే ఇద్దరు హీరోయిన్లకు రెమ్యూనరేషన్ అయిపోవాలి అని బోయపాటి ప్లాన్. అందుకే బడ్జెట్ కారణంగానే బోయపాటి శ్రీను బాలీవుడ్ హీరోయిన్లు వద్దు టాలీవుడ్ హీరోయిన్లే ముద్దు అనుకుని మంచి హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.