Pooja Hegde: ఎంపిక ముఖ్యం కాదు జీవించడం ముఖ్యం.. పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Pooja Hegde: 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పూజా హెగ్డే.
Pooja Hegde: 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. వెంటనే వరుస ఆఫర్లను దక్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది.
హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్న సమయంలో రంగస్థలంలో స్పెషల్ సాంగ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్ ఇలా టాలీవుడ్‌లో దాదాపు అందరు అంగ్ర హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే అలా వైకుంఠపురం తర్వాత పూజాకు మళ్లీ ఆ రేంజ్ విజయం దక్కలేదని చెప్పాలి.
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 వంటి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. దీంతో పూజా ఒక్కసారిగా ఢీలా పడింది. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 2024లో ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదని చెప్పాలి.
అయితే ఇప్పుడు పూజా మళ్లీ బిజీగా అవుతోంది. తెలుగులో అవకాశాలు లేకపోయినా.. హిందీ, తమిళంలో జోరు చూపిస్తోంది. వరుస అవకాశాలను దక్కించుకుంది. ఈ సంవత్సరం వరుస చిత్రాలతో అలరించడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం అగ్రకథానాయకుడు సూర్యతో కలిసి ‘రెట్రో’లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది.
సినిమా ఎంపిక విషయం గురించి మాట్లాడిన పూజా.. కెరీర్ విషయంలో తాను నిత్యం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అయతే పాత్రలను ఎంపిక చేసుకోవడం మాత్రమే ముఖ్యం కాదని, అందులో జీవించడం చాలా కీలకమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనకు వస్తోన్న వరుస అవకాశాల పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరింత వైవిధ్యమైన పాత్రలను, కథలను అన్వేషిస్తూ తెరపై నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.